టెస్లాతో జియో చర్చలు!

by Dishafeatures2 |
టెస్లాతో జియో చర్చలు!
X

న్యూఢిల్లీ: గ్లోబల్ ఈవీ కార్ల తయారీ దిగ్గజం భారత్‌లో తయారీ ప్లాంట్ ఏర్పాటుపై ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కంపెనీ తయారీ ప్లాంట్ నెలకొల్పితే 5జీ నెట్‌వర్క్ సేవలందించేందుకు గానూ రిలయన్స్ జియో టెస్లా ప్రతినిధులతో చర్చిస్తున్నట్టు సమాచారం. దీంతో టెస్లా భారత్‌లో అడుగుపెట్టే అవకాశాలు దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది. గతవారంలో టెస్లాకు చెందిన సీనియర్ ఉద్యోగులు భారత ప్రభుత్వాధికారులతో సమావేశమయ్యారు. అయితే, దీనిపై అధికారికంగా వివరాలేమీ బయటకు రాలేదు.

కానీ, టెస్లాతో జియో చర్చలు నిర్వహించడంతో కంపెనీ దేశంలోకి రానుందనే సంకేతాలిచ్చినట్టే. ప్రస్తుతానికి చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక, జియో టెస్లాతో మాత్రమే కాకుండా దేశీయంగా తయారీ, ఆటోమొబైల్ సహా ఇతర రంగాల్లోని కంపెనీలకు 5జీ నెట్‌వర్క్ సేవలందించేందుకు చర్చలు నిర్వహిస్తోంది. కాగా, జియోతో పాటు ఎయిర్‌టెల్ సైతం వివిధ సంస్థలతో 5జీ సేవలందించేందుకు చర్చలు జరుపుతోంది.

Also Read..

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!


Next Story

Most Viewed