మొదటిరోజు అమ్మకాలలో దుమ్ము రేపిన 200MP కెమెరా Realme స్మార్ట్ ఫోన్

by Harish |
మొదటిరోజు అమ్మకాలలో దుమ్ము రేపిన 200MP కెమెరా Realme స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Realme నుంచి వచ్చిన కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ‘Realme 11 Pro+ 5G’ రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. ఈ ఫోన్ జూన్ 15న Flipkart, realme.com ద్వారా ఇండియాలో విడుదలైంది. అమ్మకానికి వచ్చిన మొదటి రోజు ఈ మోడల్ ఫోన్లు దేశవ్యాప్తంగా 60,000 అమ్ముడుపోయాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ. 25,000 విభాగంలో ఇది Realme కంపెనీ అత్యధిక మొదటి సేల్స్ రికార్డ్. దీనిలో ప్రధానంగా 200MP కెమెరాను అందించడం ద్వారా ఈ అమ్మకాల మైలురాయిని చేరుకుంది.

దీని బేస్ వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ. 27,999. కొనుగోలు సమయంలో డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫోన్ 6.7-అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,412 పిక్సెల్‌లు) కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 200MP+8MP+2MP కెమెరాలు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. ఇది 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Also Read...

దేశీయ వినియోగదారుల డేటా సేకరిస్తున్న చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ!Next Story

Most Viewed