గణనీయంగా తగ్గిన ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏ!

by Vinod kumar |
గణనీయంగా తగ్గిన ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏ!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. 2018లో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) నిష్పత్తి గరిష్ఠంగా 14.6 శాతం నుంచి 2022, డిసెంబర్ నాటికి 5.53 శాతానికి తగ్గింది. ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల కారణంగా స్థూల ఎన్‌పీఏ నిష్పత్తి దిగొచ్చిందని కేంద్రం తెలిపింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 66,543 కోట్లతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మెరుగైన లాభాలను కలిగి ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో అది రూ. 70,167 కోట్లకు పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాడ్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. ఇక, 2018, మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్ క్యాప్ రూ. 4.52 లక్షల కోట్లు(2019, జనవరిలో ప్రైవేట్ బ్యాంకుగా మారిన ఐడీబీఐ బ్యాంకు మినహా)గా ఉండేది. 2022, డిసెంబర్ నాటికి రూ. 10.63 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed