41 కోట్ల మందికి రూ. 23.2 లక్షల కోట్లు

by Disha Web Desk 17 |
41 కోట్ల మందికి రూ. 23.2 లక్షల కోట్లు
X

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం(పీఎంఎంవై) కింద 40.82 కోట్ల మంది లబ్ధిదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రూ. 23.2 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 8, 2015న, ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎంఎంవై పథకం ద్వారా చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల రూపాయల రుణాన్ని అందిస్తారు. దీని కింద బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు అర్హులైన లబ్ధిదారులకు రుణాన్ని అందజేస్తాయి.

పీఎంఎంవై 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి, మార్చి 24, 2023 నాటికి, 40.82 కోట్ల మంది లబ్ధిదారులకు సుమారు రూ. 23.2 లక్షల కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అలాగే, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి MSMEల వృద్ధి భారీగా దోహదపడింది, దేశీయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని ఆమె అన్నారు.

పీఎంఎంవై అట్టడుగు స్థాయిలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనలో సహాయపడింది. ముఖ్యంగా ఈ పథకం కింద 68 శాతం ఖాతాలు మహిళా పారిశ్రామికవేత్తలకు చెందినవి కాగా, 51 శాతం ఖాతాలు SC/ST, OBC వర్గాలకు చెందినవి.

Read more:

సకాలంలో రుణాలు చెల్లిస్తున్నా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా..? అయితే ఇలా చేయండి


Next Story

Most Viewed