SBI Card : త్వరలో ఎస్‌బీఐ, ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో పేటీఎం రూపే క్రెడిట్ కార్డు!

by Disha Web Desk 17 |
SBI Card : త్వరలో ఎస్‌బీఐ, ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో పేటీఎం రూపే క్రెడిట్ కార్డు!
X

న్యూఢిల్లీ: వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ యాజమాన్యంలోని పేటీఎం ఎస్‌బీఐ కార్డ్, ఎన్‌పీసీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అందులో భాగంగా రూపే నెట్‌వర్క్‌ కింద పేటీఎం ఎస్‌బీఐ రూపే కార్డును ప్రారంభించనున్నట్టు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు తెలియజేసింది. అంతకుముందు 2020 నుంచే పేటీఎం, ఎస్‌బీఐ మధ్య భాగస్వామ్యం ఉన్నప్పటికీ తాజాగా ఎన్‌పీసీఐతో కలవడం ద్వారా కో-బ్రాండెడ్ రూపే కార్డును తీసుకురానున్నారు.

ఈ ఒప్పందంలో భాగంగా వినియోగదారులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ మెంబర్‌షిప్‌లతో కూడిన రూ. 75 వేల వరకు ప్రయోజనాలుంటాయని తెలిపింది. అలాగే, పేటీఎం యాప్‌లో విమాన టికెట్లపై తగ్గింపు కూడా పొందవచ్చని వెల్లడించింది. ఈ కార్డు కలిగిన కస్టమర్లు పేటీఎం యాప్‌లో సినిమా, ప్రయాణ టికెట్ల బుకింగ్‌లపై 3 శాతం క్యాష్‌బ్యాక్, ఇతర కొనుగోళ్లపై 2 శాతం, ఇతర ఖర్చులపై 1 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఈ భాగస్వామ్యం ద్వారా రూపే క్రెడిట్ కార్డులతో మొబైల్‌ఫోన్‌ల ద్వారా డిజిటల్ చెల్లింపులు మరింత ఊపందుకుంటాయని పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ అన్నారు. పేటీఎం రూపే కార్డులు ఉన్న వినియోగదారులకు రూ. లక్ష విలువైన సైబర్ ఫ్రాడ్ బీమా కవరేజీ ప్రయోజనాన్ని కూడా పొందుతారని విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.

Read more:

Credit Card EMI Option :వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి!

ఏడాదికి రూ.399 చెల్లిస్తే చాలు.. పోస్టాఫీసులో రూ.10 లక్షల ఇన్సూరెన్స్

దేశంలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ఏడబ్ల్యూఎస్!



Next Story

Most Viewed