గూగుల్‌కు ఝలక్.. రూ. 1,337.76 కోట్ల జరిమానా కట్టాల్సిందే!

by Disha Web Desk 17 |
గూగుల్‌కు ఝలక్.. రూ. 1,337.76 కోట్ల జరిమానా కట్టాల్సిందే!
X

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) విధించిన రూ. 1,337.76 కోట్ల జరిమానాను ఎన్‌సీఎల్ఏటీ సమర్థించింది. అంతేకాకుండా ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ తన ఆండ్రాయిడ్‌లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీసీఐ జరిమానా విధించింది. దీనిపై గూగుల్ కంపెనీ ఎన్‌సీఎల్ఏటీని ఆశ్రయించగా, సీసీఐ ఆదేశాలను సమర్థిస్తూ ఉత్తర్వులిచ్చింది.

జరిమానా చెల్లించేందుకు కూడా గడువు విధిస్తూ ఎన్‌సీఎల్ఏటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అలోక్ శ్రీవాస్తవ ఆదేశించారు. ఇదే సమయంలో సీసీఐ ఆదేశాల్లో ఎన్‌సీఎల్ఏటీ కొన్ని సవరణలు చేసింది. సీసీఐ నిర్వహించిన విచారణలో ఉల్లంఘన జరిగిందనే గూగుల్ వాదనలను ఎన్‌సీఎల్ఏటీ బెంచ్ నిరాకరించింది.

కాగా, గతేడాది అక్టోబర్‌లో సీసీఐ ఆండ్రాయిడ్ మొబైల్‌లో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందనే కారణంతో జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అనైతిక వ్యాపార విధానాలను మార్చుకోవాలని సూచించింది. దీనిపై ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టుకు వెళ్లిన గూగుల్‌కు నిరాశే ఎదురైంది. ఎన్‌సీఎల్ఏటీలో దీనిపై తేల్చుకోవాలని సూచించింది.

Also Read..

అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి వివిధ వస్తువుల ధరల్లో రానున్న భారీ మార్పులు!

Next Story

Most Viewed