భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 1,500 మందిని తొలగించిన ఓఎల్ఎక్స్!

by Disha Web Desk 7 |
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 1,500 మందిని తొలగించిన ఓఎల్ఎక్స్!
X

న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఖర్చుల నియంత్రణ, ఆర్థిక మాంద్యం ఆందోళనలు, ఇంకా ఇతర కారణాలతో ఇప్పటికే చిన్న కంపెనీలు మొదలుకొని దిగ్గజ సంస్థల వరకు వేలాదిగా ఉద్యోగులను ఇంటికి పంపాయి. తాజాగా ఈ జాబితాలో ఆన్‌లైన్ సెకెండ్ హ్యాండ్ వస్తువుల విక్రయ ప్లాట్‌ఫామ్ ఓఎల్ఎక్ కూడా చేరింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 15 శాతానికి సమానం.

అందులో భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారని కంపెనీ స్పష్టం చేసింది. దేశెయాంగా ఎంతమందిని తొలగించనున్నది కంపెనీ వెల్లడించలేదు. మొత్తం తొలగింపుల్లో కంపెనీ నిర్వహణలోని ఆటో వ్యాపారంపై ఎక్కువ ప్రభావం ఉండనుందని తెలుస్తోంది. అలాగే, నిర్వహణ, ఇంజనీరింగ్ విభాగాల్లోని కొందరు ఇంటికి వెళ్లనున్నారు. మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు, భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ పేర్కొంది.



Next Story

Most Viewed