బెంగళూరులో బైక్ టాక్సీ సేవలను తిరిగి ప్రారంభించిన Ola

by Harish |
బెంగళూరులో బైక్ టాక్సీ సేవలను తిరిగి ప్రారంభించిన Ola
X

బెంగళూరు: ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా బెంగళూరులో బైక్ టాక్సీ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. అలాగే, 5 కిలోమీటర్లకు రూ.25, 10 కిలోమీటర్లకు రూ.50లను ఛార్జ్ చేయనున్నట్లు కూడా తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికల్లో భాగంగా ఓలా S1 మోడల్, అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపనున్నారు.

ఇటీవల బైక్ ట్యాక్సీలను నిషేధించాలని క్యాబ్, ఆటో అసోసియేషన్లు ప్రభుత్వానికి విన్నవించాయి. భద్రత పరంగా బైక్ ట్యాక్సీలు మహిళలకు సురక్షితం కాదని, అలాగే తమ ఆదాయానికి ఇవి నష్టాన్ని కలిగిస్తున్నాయని క్యాబ్, ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు. కర్ణాటకతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు బైక్ ట్యాక్సీలను నిషేధించాలని ఆలోచిస్తున్నాయి.

అయితే ఇలాంటి తరుణంలో ఓలా తిరిగి తన బైక్ టాక్సీ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యకర విషయం. బైక్ టాక్సీలు ప్రధానంగా మెట్రో, బస్సు, రైల్వే స్టేషన్లు తదితర దగ్గర ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేయడానికి సులభంగా ఉండటంతో పాటు మిగతా వాటితో పోలిస్తే ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయి.

Next Story

Most Viewed