హైదరాబాద్‌లో కొత్తగా మరో రెండు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించిన Ola

by Disha Web Desk 17 |
హైదరాబాద్‌లో కొత్తగా మరో రెండు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించిన Ola
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ కావడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా రెండు ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు కేంద్రాలు.. శంషాబాద్, ఎ.ఎస్ రావు నగర్‌లో ఏర్పాటు చేయబడ్డాయి. ఇంతకుముందు హైదరాబాద్ లో ఏడు కేంద్రాలు ఉన్నాయి. కొత్త వాటితో కలుపుకుని మొత్తం హైదరాబాదులో ఉన్న ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల సంఖ్య తొమ్మిదికి చేరాయి.


ఈ కేంద్రాలలో కస్టమర్లు ఓలా S1, S1 ప్రో స్కూటర్లను టెస్ట్-రైడ్ చేయవచ్చు. అలాగే కొనుగోలు గురించిన పూర్తి సమాచారం, సలహాలు పొందవచ్చు. తన 2,50,000 మంది కస్టమర్లకు సులభంగా సర్వీస్ అందించడానికి, కొనుగోలు తర్వాత సమస్యల పరిష్కారానికి ఈ సెంటర్లు బాగా ఉపయోగపడతాయని కంపెనీ పేర్కొంది. అలాగే, ఈ కేంద్రాల ఏర్పాటుతో కంపెనీ ఏప్రిల్ చివరి నాటికి 500 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లవుతుందని, ఆగస్టు 15 వ తేదీ నాటికి 1,000 కేంద్రాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓలా యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read..

త్వరలో జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు!

Next Story