ఓలా ఎలక్ట్రిక్ కార్ ఇండియాలో అందుబాటులోకి వచ్చేది అప్పుడే

by Disha Web Desk 21 |
ఓలా ఎలక్ట్రిక్ కార్ ఇండియాలో అందుబాటులోకి వచ్చేది అప్పుడే
X

దిశ, వెబ్‌డెస్క్ : అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఓలా కార్ల కంపెనీ ఒకటి. కాగా ఏటా 10మిలియన్ స్కూటర్లు, వన్ మిలియన్ కార్లు మరియు 100జిడబ్ల్యూహెచ్ సెల్‌ఫోన్‌లను ఉత్పత్తి చేసే ఓలా కంపెనీ తాజాగా మరో ముందడుగు వేసింది. 2024లో ఇండియాలో 500 కి.మీల స్పీడ్‌తో ఓలా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ సోమవారం భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వర్చువల్ ఈవెంట్‌లో ప్రకటించారు. ఇక అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఓలా ఎలక్ట్రిక్ కారు కేవలం నాలుగు సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగంతో పయనిస్తుందని ఆయన పేర్కొన్నారు. '' ఇండియాలో ఇప్పటివరకు చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఈ కార్ ప్రాజెక్ట్ ఒకటి'' అని ఆయన తెలిపారు.

అయితే ఇందుకు సంబంధించి తమిళనాడు పోచంపల్లిలోని ఒకే ప్లాంట్‌లో కార్స్, టూ వీలర్స్, బ్యాటరీలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో.. కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తోందని.. అందువల్ల ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఈవి(EV) హబ్‌గా మారబోతోందని అగర్వాల్ అన్నారు. ఇందుకోసం 100 ఎకరాల లిథియం అయాన్ సెల్ ప్లాంట్, 200 ఎకరాల ఈవి కార్ ప్లాంట్‌తో పాటు 40 ఎకరాల ఈవి స్కూటర్ ప్లాంట్లు ఉన్నాయని చెప్పారు. ఇక టెస్లా వంటి కంపెనీలు వెస్టర్న్ మార్కెట్‌లకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేయడంలో ముందుండగా.. ఇండియా మోటార్‌బైక్‌ల రంగంలో చిన్న కార్లు మరియు స్కూటర్ల డిమాండ్‌తో ప్రపంచంలో ముందుంటుందని పేర్కొన్నారు.

2024 నాటికి 500 కిలోమీటర్లతో ఓలా కార్ల ఉత్పత్తి: భవిష్ అగర్వాల్!

Next Story

Most Viewed