- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
ఈవీ స్కూటర్లపై తగ్గింపు ఆఫర్ ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్!

బెంగళూరు: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ హోళీ పండుగను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. కొత్తగా ఓలా స్కూటర్లను కొనాలనుకునే వినియోగదారుల కోసం కంపెనీ తన ఓలా ఎస్1 మోడల్‌పై రూ. 2 వేలు, ఎస్1 ప్రో మోడల్‌పై రూ. 4 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
ఒకవేళ ఎవరైనా కస్టమర్లు తమ సాంప్రదాయ ఇంధన టూ-వీలర్లను ఎక్స్‌ఛేంజ్ ద్వారా ఓలా స్కూటర్‌ను కొనాలనుకుంటే ఆఫర్ కింద రూ. 45,000 వరకు రాయితీ లభిస్తుంది. ఈ ఆఫర్ హోళీ పండుగను పురస్కరించుకుని మార్చి 8-12వ తేదీల మధ్య అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
అంతేకాకుండా హోళీ సందర్భంగా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ద్వారా తమ స్కూటర్లను కొనాలనుకునే వారికి అదనంగా మరో రూ. 6,999 ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది. ఈ నెల 11,12 తేదీల్లో ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను కొనేవారు ఓలా కేర్‌ప్లస్ సబ్‌స్క్రిప్షన్, ఎక్స్‌టెండెడ్ వారంటీపై 50 శాతం తగ్గింపు పొందవచ్చని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్సుల్ ఖండేల్‌వాలా వెల్లడించారు.