Hyderabad లో 64 శాతం పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ గిరాకీ!

by Disha Web Desk 17 |
Hyderabad లో 64 శాతం పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ గిరాకీ!
X

బెంగళూరు: ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల కాలంలో దేశంలోని ప్రధాన ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్ గిరాకీ క్షీణించింది. జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 3.8 కోట్ల చదరపు అడుగులుగా నమోదైంది. ఇది గతేడాది తొమ్మిది నెలల్లో ఉన్న 3.98 కోట్ల చదరపు అడుగుల కంటే 4.5 శాతం తక్కువని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్ శుక్రవారం ప్రకటనలో తెలిపింది.

మొత్తం ఆఫీస్ స్పేస్ విభాగంలో దాదాపు సగం వాటాతో బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్ అధిక వాటాను కలిగి ఉన్నాయి. త్రైమాసిక పరంగా జులై-సెప్టెంబర్ మధ్య ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్ కార్యకలాపాలు 1.32 కోట్ల చదరపు అడుగులుగా నమోదయ్యాయి. ఇది గతేడాది కంటే 2 శాతం ఎక్కువ.

టెక్ ఆధారిత దక్షిణాది నగరాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో సెప్టెంబర్ వరకు 57 శాతం ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఉంది. వాటిలో చెన్నై స్థిరంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 64 శాతం పుంజుకోవడం విశేషం. బెంగళూరు లీజింగ్ కార్యకలాపాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

జులై-సెప్టెంబర్‌లో చెన్నై, హైదరాబాద్ నగరాలు అధిక డిమాండ్‌ను చూశాయని కొలియర్స్ ఇండియా ఎండీ అర్పిత్ మెహ్రోత్రా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత వల్ల విదేశీ కంపెనీల నుంచి ఎక్కువ గిరాకీ లేనప్పటికీ దేశీయంగా ఇంజనీరింగ్, తయారీ, బీఎఫ్ఎస్ఐ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల నుంచి డిమాండ్ మద్దతిస్తోంది.

ఇవి కూడా చదవండి : TCS ఉద్యోగులకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇక హైబ్రిడ్ పాలసీకి గుడ్‌బై!



Next Story

Most Viewed