7.5 శాతం తగ్గిన అత్యంత సంపన్నుల సంఖ్య!

by Harish |
7.5 శాతం తగ్గిన అత్యంత సంపన్నుల సంఖ్య!
X

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుల సంఖ్య 2022లో 7.5 శాతం తగ్గిందని ఓ నివేదిక తెలిపింది. నైట్‌ఫ్రాంక్ తాజా 'వెల్త్ రిపోర్ట్-2023' ప్రకారం, నికర ఆస్తి విలువ సుమారు రూ. 227 కోట్ల కంటే ఎక్కువ విలువైన అల్ట్రా-హై-నెట్-వర్త్ వ్యక్తుల సంఖ్య 2022లో 12,069గా ఉంది. అయితే, వచ్చే ఐదేళ్లలో(2027 నాటికి) వీరి సంఖ్య 58.4 శాతం పుంజుకుని 19,110కి చేరుతుందని వెల్లడించింది. అంచనా వేసింది.

ఇక, బిలియనీర్ల సంఖ్య 2021లో 145 నుంచి 2022 నాటికి 161 కి చేరుకుంది. వీరి సంఖ్య 2027 నాటికి 195కి పెరుగుతుందని నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. అలాగే, 1 మిలియన్ డాలర్ల(రూ. 8.24 కోట్లు) కంటే అధిక సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య 2021లో 7,63,674 నుంచి గత ఏడాది 7,97,714కి చేరింది. 2027 నాటికి ఈ సంఖ్య 16,57,272కి పెరుగుతుందని నివేదిక అభిప్రాయపడింది.

దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా అల్ట్రా-హై-నెట్-వర్త్ వ్యక్తుల సంఖ్య 3.8 శాతం తగ్గింది. 2021లో వీరి సంఖ్య 9.3 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్ల పెరుగుదల, భౌగోళిక రాజకీయ అస్థిరత వంటి కారణాలతో ధనికుల పెట్టుబడుల విలువ తగ్గాయని నివేదిక వివరించింది. భారత్‌లో సైతం ఆ ప్రభావం కనిపించింది, ఇదే సమయంలో డాలర్ కంటే రూపాయి మారకం విలువ బలహీనపడటం కూడా ధనికుల పెట్టుబడులపై ప్రభావం కనిపించిందని నివేదిక పేర్కొంది.Next Story

Most Viewed