ఈక్విటీ ట్రేడింగ్ చేసే వారికి గుడ్‌న్యూస్ చెప్పిన NSE!

by Disha Web Desk 17 |
ఈక్విటీ ట్రేడింగ్ చేసే వారికి గుడ్‌న్యూస్ చెప్పిన NSE!
X

ముంబై: ఈక్విటీ ట్రేడింగ్‌పై గతంలో పెంచిన ఛార్జీలను వెనక్కి తీసుకుంటున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) శుక్రవారం ప్రకటించింది. దాంతో ఈక్విటీ ట్రేడర్లు వచ్చే నెల నుంచి తక్కువ లావాదేవీ ఛార్జీలను చెల్లించనున్నారు. 2021, జనవరిలో పెట్టుబడిదారుల రక్షణ నిధి(ఐపీఎఫ్‌టీ)ని పెంచేందుకు ఎన్ఎస్ఈ ఈక్విటీలపై లావాదేవీ ఛార్జీలను 6 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా క్యాష్, డెరివేటివ్స్ విభాగాల్లో పెంచిన ఛార్జీలను వాపసు చేస్తున్నట్టు ఎన్ఎస్ఈ తెలిపింది.

వాపసు ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుందని గురువారం డైరెక్టర్ల బోర్డు సమావేశంలో వెల్లడించింది. మదుపర్ల క్లెయిమ్‌లను తీర్చేందుకు డిఫాల్టర్ల ఆస్తులు సరిపోకపోతే పెట్టుబడిదారులకు పరిహారం చెల్లించే లక్ష్యంతో ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల రక్షణ నిధిని ఏర్పాటు చేసింది. తాజా నిర్ణయంతో ఈక్విటీ ట్రేడింగ్‌పై లావాదేవీ ఛార్జీలు 4 శాతానికి తగ్గనుంది. ఐపీఎఫ్‌టీ బోర్డు సభ్యులు, ఎక్స్ఛేంజ్ సీనియర్ అధికారులతో కూడిన ట్రస్టీల చేత నిర్వహించబడుతోంది.


Next Story