- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
దేశంలో పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు సెప్టెంబర్ 16 నాటికి రూ. 8,65,117 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన ఇది రూ.23.5 శాతం ఎక్కువ. గత ఏడాది పన్ను వసూళ్లు రూ. 7,00,416 కోట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది కార్పొరేట్ల నుంచి ముందస్తు పన్ను వసూళ్లు ఎక్కువగా ఉండటం వలన గత ఏడాది కంటే ఈ సారి పన్ను వసూళ్లు పెరిగినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. రూ. 8.65 లక్షల కోట్ల పన్ను వసూళ్లలో రూ.4.16 లక్షల కోట్లు కార్పొరేట్ ఆదాయపు పన్ను కాగా, రూ.4.47 లక్షల కోట్లు వ్యక్తిగత ఆదాయ పన్ను.
ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 16 వరకు ముందస్తు పన్ను వసూళ్లు 20.7 శాతం పెరిగి రూ.3.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 2,94 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత పన్ను వసూళ్లలో రూ. 2,80 లక్షల కోట్లు కార్పొరేట్ పన్ను, రూ. 74,858 కోట్ల వ్యక్తిగత ఆదాయ పన్ను ఉన్నాయి. అలాగే, రూ. 1.22 లక్షల కోట్ల రీఫండ్లను సర్దుబాటు చేశారు. పన్ను వసూళ్ల ప్రక్రియలో టెక్నాలజీని ఉపయోగించడం, ప్రజలకు పన్ను గురించి అవగాహన కల్పించడం ద్వారా పన్ను వసూళ్లు పెరిగినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.