పిల్లల ఆహారంలో అధిక షుగ‌ర్ లెవ‌ల్స్.. నెస్లెపై ప్రభుత్వ నిఘా

by Dishanational1 |
పిల్లల ఆహారంలో అధిక షుగ‌ర్ లెవ‌ల్స్.. నెస్లెపై ప్రభుత్వ నిఘా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ నెస్లె కంపెనీపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచింది. దేశంలో విక్రయించే పసిపిల్లల పాలలో నెస్లే యాడెడ్ షుగర్స్ కలుపుతున్నట్లు అందిన నివేదికలను భారత ప్రభుత్వం సుమో-మోటోగా తీసుకుంది. దేశీయంగా కంపెనీకి చెందిన పిల్లల ఆహార ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడుపోతాయి. ఈ క్రమంలో ప్రధాన ఉత్పత్తుల్లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్టు పలు నివేదికల్లో బయటపడింది. 'నెస్లెకి సంబంధించిన నివేదికను మేము పరిగణలోకి తీసుకున్నాము. తగిన పరిశీలన తర్వాత ఈ విషయాన్ని సమీక్షిస్తామని' ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌లోని నిబంధనలను అనుసరించి, నెస్లే పిల్లల ఆహార నమూనాలను తనిఖీ చేయమని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)ని కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ అంశంపై త్వరలో చర్చించనున్నట్టు వెల్లడించారు. అయితే, బ్రిటన్ , స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల్లో అమ్ముడయ్యే ఆయా ఉత్పత్తుల్లో షుగర్ లెవల్స్ సాధారణ స్థాయిలో ఉందని దర్యాప్తులో తేలింది.

భారత్‌లో 15 సెరెలాక్ బేబీ ఉత్పత్తుల్లో సగటున 3 గ్రాముల అధిక షుగర్ లెవల్స్ ఉన్నట్టు పరిశోధనలో తేలింది. అలాగే, థాయిలాండ్, ఇథియోపియా దేశాల్లో షుగర్ లెవల్స్ ఆరు గ్రాములు ఉంది. అయితే, దీనికి సంబంధించ్ నెస్లె ఇండియా ప్రతిప్నిధి ఆరోపణలను ఖండించారు. గత ఐదేళ్లలో పసిపిల్లల సెరెలాక్‌లో షుగర్ లెవల్స్‌ను 30 శాతం మేర తగ్గించామని చెప్పారు. చిన్నారులకు అవసరమైన పోషక విలువలతో కూడిన ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు.

అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన మార్కెట్‌లకు భిన్నంగా ఆసియా దేశాలలో సెరెలాక్‌లో షుగర్ స్థాయిలు వేరుగా అందితోందని నివేదికలు పేర్కొన్నాయి. అంత‌ర్జాతీయ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘించిన‌ట్టు నెస్లెపై ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఊబ‌కాయం, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు కార‌ణ‌మైన షుగ‌ర్ మోతాదులను ఎక్కువ‌గా వాడుతున్నట్టు నివేదిక వెల్లడించాయి. ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని నెస్లే ఉత్ప‌త్తుల్లోనే ఈ షుగ‌ర్ లెవల్స్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు సమాచారం. కాగా, 2022లో దేశీయంగా నెస్లే సుమారు రూ. 2,000 కోట్ల విక్రయాలు నమోదు చేసింది. అన్ని సెరెలాక్ బేబీ ఉత్పత్తులు యాడెడ్ షుగర్‌(సగటు ఒక సర్వ్‌కు 3 గ్రాములు)ను కలిగి ఉన్నాయని స్విస్ పరిశోధనా సంస్థ పేర్కొంది.

Next Story

Most Viewed