ఎక్కువ మంది సంపన్నులున్న జాబితాలో భారతీయ నగరాలు

by Dishanational1 |
ఎక్కువ మంది సంపన్నులున్న జాబితాలో భారతీయ నగరాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాదికి సంబంధించి ప్రపంచ సంపన్న నగరాల జాబితాలో భారత్ నుంచి ఢిల్లీ, ముంబై నగరాలు టాప్-50లో చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు నగరం మాత్రం టాప్-10 అత్యంత ఆశాజనకమైన నగరాల జాబితాలో నిలిచింది. అంతర్జాతీయంగా వివిధ నగరాల్లో ఎక్కువమంది అత్యంత సంపన్నుల జాబితాను రూపొందించే ప్రముఖ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ తాజా నివేదిక ప్రకారం, అమెరికాలో ఎక్కువ బిలీయనీర్లు ఉన్న నగరాలు 11 ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి ఢిల్లీ, ముంబై, నగరాలకు కూడా స్థానం లభించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధికంగా 58,800 మంది అత్యంత సంపన్నులు ఉండగా, 236 మంది రూ. 800 కోట్లకు పగా, 29 మంది రూ. 8 వేల కోట్లకు పైగా సంపదను కలిగి ఉన్నారు. హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ జాబితాలో ముంబై 31వ ర్యాంకు సాధించింది. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 30,700 మంది కోటీశ్వరులతో 32వ ర్యాంకు కలిగి ఉంది. ఇక, బెంగళూరు నగరం టాప్-50 జాబితాలో స్థానం పొందలేకపోయినప్పటికీ టాప్-10 భవిష్యత్తులో గణనీయంగా పెరిగే నగరంగా నిలిచింది. బెంగళూరులో మొత్తం 13,200 మంది బిలీయనీర్లు ఉన్నారు. అగ్రస్థానంలో న్యూయార్క్ సిటీలో మొత్తం 3,49,500 మంది కోటీశ్వరులు ఉండగా, గడిచిన పదేళ్లలో వారి సంఖ్య 48 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. న్యూయార్క్ నగరంలోని ప్రతి 24 మందిలో ఒకరు కోటీశ్వరులు ఉండటం విశేషం.

Next Story