కంటెంట్ క్రియేటర్స్ కోసం 'మోజ్‌ డే అవుట్‌'ని నిర్వహించిన మోజ్‌

by Disha Web |
కంటెంట్ క్రియేటర్స్ కోసం మోజ్‌ డే అవుట్‌ని నిర్వహించిన మోజ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో అతిపెద్ద షార్ట్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌గా పేరు తెచ్చుకుంది మోజ్‌. ఇప్పటికే దేశంలో ఎంతో పాపులర్‌ అయిన మోజ్‌ తన క్రియేటర్స్‌ కోసం తొలిసారిగా డే అవుట్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. మోజ్‌ ఫర్ క్రియేటర్స్ (MFC) అకాడమీ (అప్‌స్కిల్లింగ్ క్రియేటర్ ప్రోగ్రామ్) ద్వారా ధృవీకరించబడిన 60 మంది క్రియేటర్‌లు, ఈ వన్-డే ఈవెంట్‌కు హాజరై తమ అభిప్రాయాలను షేర్‌ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ క్రియేటర్‌లు అయినటువంటి తరుణ్ కుమార్, మారి విక్కీ, మాధురీ రాథోడ్, సాయికృష్ణ, పల్లవి అశ్విని, మౌనిక నాయక్, నాగేంద్ర బాబు,నిఖిల్ స్టై హాజరయ్యారు.

హైదరాబాద్‌లో అద్భుతంగా నిర్వహించిన ఈ ఈవెంట్ అప్ కమింగ్ కంటెంట్ క్రియేటర్‌లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, సరైన కంటెంట్‌ను రూపొందించడానికి ఇది అవకాశాన్ని కల్పించింది. హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న క్రియేటివ్‌ కమ్యూనిటీని గుర్తించిన మోజ్‌, బలమైన క్రియేటర్ కమ్యూనిటీని ప్రోత్సహించడానికి #HyderabdiMiya అనే హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభించింది.


నగరంలోని యువత వారి ప్రతిభను మోజ్‌ ప్లాట్‌ఫామ్‌పై మోనటైజ్ చేసేందుకు, అలాగే వారికి ఇష్టమైన రంగాల్లో కంటెంట్‌ను రూపొందించడానికి అవకాశాలను ఏర్పాటు చేసింది. క్రియేటర్‌లు తమ మోజ్‌ ఫర్‌ క్రియేటర్స్‌ (MFC) కోర్సు అనుభవాలు, అలాగే తమ కంటెంట్ సృష్టిని ఎలా ప్రభావితం చేస్తున్నారో, వాటి కోసం ఏం చేస్తున్నారో అందరితో పంచుకున్నారు.

అంతేకాకుండా వైరల్ కంటెంట్ ట్రిక్స్, ట్రెండ్‌లను డీకోడ్ చేయడం లాంటివాటి గురించి కూడా చర్చించారు. ఇక ఈవెంట్‌లో #banthipoolajanaki, #Irrukkupo అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ట్రెండింగ్ కంటెంట్‌ను సృష్టించే బాధ్యత క్రియేటర్‌లకు ఇచ్చారు. అక్కడికక్కడే సృజనాత్మకంగా, హాస్యభరితంగా ఉండే కంటెంట్‌ను అప్పటికప్పుడు క్రియేటర్స్‌ సృష్టించి అందరిని ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా మోజ్‌, షేర్‌చాట్‌ కంటెంట్ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ శ్రీ శశాంక్ శేఖర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… "మోజ్‌లో ఈజీగా ఉండే టూల్స్‌, ప్రొసీజర్స్‌ ద్వారా క్రియేటర్స్‌ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకునేలా మేం ప్రోత్సహిస్తున్నాం. హైదరాబాద్‌లోని డేఅవుట్, ఉద్దేశ్యం ఏంటంటే, తెలంగాణలోని మా క్రియేటర్ కమ్యూనిటీ పరస్పరం వ్యవహరించడానికి, భవిష్యత్ కంటెంట్ సహకారాల కోసం ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, బలమైన కమ్యూనిటీని నిర్మించడానికి ఒక వేదికను అందించడం.

ఈవెంట్ కోసం చాలా మంది వ్యక్తులు సైన్ అప్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో మోజ్‌లో కొన్ని ఉత్తేజకరమైన కంటెంట్, సహకారం కోసం మేము ఎదురుచూస్తున్నాము" అని అన్నారు.

ఈ సందర్భంగా మోజ్‌లో పాపులర్‌ క్రియేటర్‌ అలాగే యాప్‌లో 5 మిలియన్లకు పైగా సబ్‌స్కైబర్స్‌ ఉన్న తరుణ్ కుమార్ మాట్లాడారు. " మా క్రియేటర్స్‌ అభిప్రాయాలు, అనుభవాలు షేర్‌ చేసుకునేందుకు హైదరాబాద్‌లో 'మోజ్ ఫామ్'ని ఏర్పాటుచేసిన మోజ్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మేము ఒకరి నుండి మరొకరు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. సృజనాత్మక ఆలోచనలను పంచుకోవడం, కొత్త పోకడలను కనుగొనడం, మా కంటెంట్‌ను మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించకోవడం. ఇది నిజంగా మా జ్ఞానాన్ని విస్తరించడానికి, మా పనిని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు.

హైదరాబాద్‌ బాచుపల్లి దగ్గర ఉన్న రంగస్థలం స్టూడియోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో వివిధ రంగాలకు చెందిన సృష్టికర్తలు కమ్యూనిటీ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను, సృజనాత్మక సామర్థ్యాలను ప్రదర్శించారు.

ఈ ఈవెంట్‌లో ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్‌స్టైల్, డ్యాన్స్, కామెడీ మొదలైన జానర్‌లలో కంటెంట్‌ను రూపొందించడానికి సెటప్‌లు, బ్యాక్‌డ్రాప్‌లతో కూడిన జోన్‌లు కూడా ఏర్పాటు చేశారు. ర్యాంప్ వాకింగ్ వంటి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో క్రియేటర్స్‌ ఉల్లాసంగా పాల్గొన్నారు. అంతేకాకుండా వైరల్ థాట్స్‌, పాటల ఆధారంగా ఆసక్తికరమైన ఛాలెంజ్‌లు వారిలోని క్రియేటివిటినీ మరింతగా పెంచింది. ఓవరాల్‌గా ఈ ఈవెంట్‌ క్రియేటర్స్‌కు కొత్త ఉత్సాహాన్ని, అద్భుతమైన కంటెంట్‌ను మరింత అందించాలనే కసిని పెంచింది.

Next Story

Most Viewed