టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓగా మోహిత్ జోషి

by Disha Web Desk 17 |
టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓగా మోహిత్ జోషి
X

బెంగళూరు: ఇన్ఫోసిస్ కంపెనీకి రాజీనామా చేసిన ఆ కంపెనీ మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషి, ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రాలో మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని టెక్ మహీంద్రా శనివారం అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 20 నుంచి ఈ నియామకం అమల్లోకి రానున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం, 20 డిసెంబర్ 2023 నుండి ఐదు సంవత్సరాల కాలానికి డిసెంబర్ 19, 2028 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం సీఈఓగా CP గుర్నానీ ఉన్నారు. ఆయన పదవీ కాలం డిసెంబర్ 19 తో ముగుస్తుంది.

ఇన్ఫోసిస్ కంపెనీలో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ వ్యాపారానికి బాధ్యత వహించిన మోహిత్ జోషి మార్చి 11న తన పదవికి రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయన చివరి తేదీ జూన్ 9న ముగియనుంది. అయితే రాజీనామా తర్వాత మార్చి 11 నుంచి ఆయన సెలవుల్లో ఉంటారు. ఇన్ఫోసిస్‌లో 22 సంవత్సరాలు పనిచేసిన జోషికి ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్ స్పేస్‌లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. అలాగే, ఎడ్జ్‌వెర్వ్ సిస్టమ్స్‌కు ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.

ఈ నియామకంపై టెక్ మహీంద్రా ఎన్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ టిఎన్ మనోహరన్ మాట్లాడుతూ.. కొత్తగా మోహిత్ జోషి నియామకం కఠినమైన ఎంపిక ప్రక్రియ. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, కొత్త టెక్నాలజీతో మోహిత్ అనుభవం టెక్ మహీంద్రాకు ఎంతో ఉపయోగపడుతుంది. కంపెనీ భారీ డీల్స్‌ను పొందటంతో పాటు బలమైన వృద్ధి ఊపందుకోవడంలో ఆయన ఎంపిక కలిసొస్తుందని అన్నారు.

Also Read..

వడ్డీ రేట్లను పెంచిన కెనరా బ్యాంక్


Next Story

Most Viewed