పెరగనున్న పాల ధరలు.. పెంచిన ధర ఎంతో తెలుసా?

by Disha Web Desk 10 |
పెరగనున్న పాల ధరలు.. పెంచిన ధర ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఒక పక్క పెరిగిన టమాట ధరల వల్ల సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ ధరలు తగ్గక ముందే ఇప్పుడు పాల ధరలు కూడా పెరగనున్నాయట. కర్ణాటకలో పాల ధరలు 2023 ఆగష్టు 01 నుంచి పెరగనున్నాయని తెలుస్తుంది.

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ బృందం, ముఖ్యమంత్రి సిద్దరామయ్య భేటీ అయినా తరువాత ప్రముఖ పాల బ్రాండ్ నందిని లీటరు పాలకు రూ. 3 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. పెరిగిన పాల ధరలు ఆగష్టు 01 నుండి అమలులోకి రానున్నాయి. ఈ ధరలు కేవలం పాలకు మాత్రమే వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో లీటరు పాల ధర రూ. 39 ఉండగా.. ఆగష్టు 01 నుంచి ఇది రూ. 42కు చేరనుంది. ఈ ధరల పెరుగుదల వల్ల పాడి పరిశ్రమ అదనపు ఆదాయాన్ని పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పెరిగిన పాల ధరల వల్ల సామాన్యుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది.


Next Story