సరికొత్త గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను విడుదల చేసిన ఎంజీ మోటార్ ఇండియా!

by Harish |
సరికొత్త గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను విడుదల చేసిన ఎంజీ మోటార్ ఇండియా!
X

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తన ఎస్‌యూవీ గ్లోస్టర్ కొత్త ఎడిషన్‌ను సోమవారం మార్కెట్లో విడుదల చేసింది. రూ. 40.29 లక్షల ప్రారంభ ధరతో తీసుకొచ్చిన ఈ మోడల్‌లో సరికొత్త ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. బ్లాక్‌స్టార్మ్ పేరుతో విడుదల చేసిన ఈ ఎస్‌యూవీ అడ్వాన్స్‌డ్ గ్లోస్టర్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించింది. 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చిన గ్లాస్టర్‌లో మొత్తం 30 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లను అందించామని వివరించింది.స్నో, మడ్, ఎకో, స్పోర్ట్, నార్మల్, రాక్, శాండ్ అనే 7 రకాల డ్రైవింగ్ మోడ్‌లలో దీన్ని అందిస్తున్నామని, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, అడ్జస్టబుల్ డ్రైవర్ స్టీ లాంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కంపెనీ సంవత్సరానికి 1.2 లక్షల యూనిట్ల వరకు ఉత్పత్తి చేయగలదు. ప్రస్తుతం కంపెనీ ఈవీ విభాగంపై దృష్టి సారించిందని, దేశీయ మార్కెట్లో మరో 4-5 కొత్త కార్లను తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్టు ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా అన్నారు.Next Story

Most Viewed