ఎలక్ట్రిక్ కారు 'కామెట్' ధర ఇదే.. 3 ఏళ్ల తర్వాత 60 శాతం డబ్బులు వెనక్కి!

by Disha Web Desk 17 |
ఎలక్ట్రిక్ కారు కామెట్ ధర ఇదే.. 3 ఏళ్ల తర్వాత 60 శాతం డబ్బులు వెనక్కి!
X

న్యూఢిల్లీ: కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల భారత మార్కెట్లో తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు 'కామెట్' ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మూడు వేరియంట్లలో తీసుకొచ్చిన కామెట్ కారు ధరల వివరాలను శుక్రవారం కంపెనీ వెల్లడించింది. అందులో ప్రారంభ కామెట్ పేస్ వేరియంట్ ధర రూ. 7.98 లక్షలుగా నిర్ణయించగా, కామెట్ ప్లే ధర రూ. 9.28 లక్షలు, కామెట్ ప్లష్ ధర రూ. 9.98 లక్షలు(ఎక్స్‌షోరూమ్)కే లభించనుంది. ఈ ధరలు మొదటి 5,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయని ఎంజీ మోటార్ ఇండియా పేర్కొంది.

ధరల వివరాలతో పాటు కంపెనీ కామెట్‌పై బైబ్యాక్ సౌకర్యాన్ని కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది. మూడు సంవత్సరాల తర్వాత ఈవీని వెనక్కి ఇస్తే ఎక్స్‌షోరూమ్ ధరలో 60 శాతం డబ్బును తిరిగి ఇవ్వనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, ఎంజీ ఈ-షీల్డ్ ఓనర్‌షిప్ ప్యాకేజీ ద్వారా 3 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారెంటీ, మూడేళ్లు రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మూడు ఉచిత లేబర్ సర్వీస్, 8 ఏళ్లు లేదా 1.20 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారెంటీ ఇస్తున్నట్టు వివరించింది.

అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన కామెట్ కారు సింగిల్ ఛార్జ్‌తో 230 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 0-100 శాతం ఛార్జింగ్ చేసేందుకు 7 గంటల సమయం పడుతుందని ఎంజీ మోటార్ ఇండియా పేర్కొంది.

Next Story