ఒక్క చార్జింగ్‌తో 550 కి.మీ.. మెర్సిడెస్ బెంజ్ కొత్త ఈవీ కారు

by Harish |
ఒక్క చార్జింగ్‌తో 550 కి.మీ.. మెర్సిడెస్ బెంజ్ కొత్త ఈవీ కారు
X

దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో కొత్తగా ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘మెర్సిడెస్ EQE 500’. ఇది SUV రూపంలో విడుదల చేయబడింది. దీని ధర రూ. 1.39 కోట్లు. ఇది ఒక్కసారి చార్జింగ్‌తో 550 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. కేవలం 4.9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కి.మీ. ఈ కారు 90.56kWh బ్యాటరీని కలిగి ఉంది. 11kW AC చార్జర్‌, 170kW వరకు DC ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 408hp పవర్, 858Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు బ్యాటరీపై కంపెనీ ప్రత్యేకంగా 10 సంవత్సరాల వారంటీ అందిస్తుంది. మెర్సిడెస్ EQE 500 SUV 56-అంగుళాల హైపర్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. కారు లోపల ప్రత్యేకమైన ఎయిర్ ఫిల్టర్, సౌండ్ సిస్టమ్‌, యాక్టివ్ యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ Apple CarPlay/Android , పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జర్ వంటి మొదలగు ఫీచర్లను కలిగి ఉంటుంది.

Next Story

Most Viewed