దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను పెంచే ప్రయత్నాల్లో మెర్సిడెస్ బెంజ్!

by Web Desk |
దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను పెంచే ప్రయత్నాల్లో మెర్సిడెస్ బెంజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ వాహన సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయంగా అసెంబుల్ చేయబడిన తన పూర్తి ఎలక్ట్రిక్ సెడాన్ ఈక్యూఎస్ మోడల్ ద్వారా భారత మార్కెట్లో అమ్మకాలను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మోడల్ కారును ప్రస్తుతం త్రైమాసికంలోపు మార్కెట్లో విడుదల చేయనుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ ష్వెంక్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహాన్ని అభివృద్ధి చేసేందుకు తాము దశలవారీ చర్యలు తీసుకోనున్నాం. ఈక్యూఎస్ మోడల్ మొదట 50 నగరాల్లో అందుబాటులో ఉంటుంది. త్వరలో దీన్ని విస్తరించనున్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియోను పెంచనున్నాం. మెరుగైన అమ్మకాలతో స్థానికంగానే ఉత్పత్తిని ప్రారంభించగలనే నమ్మకం ఉందని మార్టిన్ ష్వెంక్ అన్నారు. ప్రస్తుతం ఈక్యూఎస్ మోడల్‌ను స్థానికంగా అసెంబుల్ చేయడంతో పాటు ఈ కారును దేశీయంగానే ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Next Story