అమ్మకాల్లో సరికొత్త మైలురాయికి చేరుకున్న మారుతీ సుజుకి 'WagonR'

by Disha Web Desk 17 |
అమ్మకాల్లో సరికొత్త మైలురాయికి చేరుకున్న మారుతీ సుజుకి WagonR
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ వ్యాగన్ఆర్ రెండు దశాబ్దాల్లో 30 లక్షల కార్లను విక్రయించినట్లు మంగళవారం ప్రకటనలో తెలిపింది. 1999లో కంపెనీ వ్యాగన్ఆర్ మోడల్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిందని, 2008లో ఐదు లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించిన కారు, ఆ తర్వాత 2017లో 20 లక్షలు, 2021 నాటికి 25 లక్షలు, ఈ ఏడాది 30 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది.

ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ విభాగంలో వ్యాగన్ఆర్‌కు వినియోగదారుల నుంచి అత్యంత ఆదరణ లభించిందని, ఎప్పటికప్పుడు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అప్‌డేట్ వెర్షన్‌ను తీసుకొచ్చామని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా ఎక్కువమంది కొనుగోలు చేసిన మోడల్ ఇదేనని ఆయన స్పష్టం చేశారు.

Also Read..

తక్కువ ధరకు కొత్త రకం ప్రీమియం డీజిల్ తెచ్చిన జియో-బీపీ!

Next Story