రూ. 25,000 వరకు కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకి

by Dishanational1 |
రూ. 25,000 వరకు కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి కార్లను ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన కార్లపై ఈ పెంపు వర్తిస్తుందని, తన హ్యాచ్‌బ్యాంక్ స్విఫ్ట్ ధరను రూ. 25,000 వరకు పెంచామని, ఎస్‌యూవీ మోడల్ గ్రాండ్ విటారా వేరియంట్‌ని బట్టి ధరలు పెంచినట్టు బుధవారం వెల్లడించింది. గ్రాండ్ విటారాలో సిగ్మా వేరియంట్‌పై రూ. 19,000 వరకు పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ పేర్కొంది. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను భరించేందుకు వినియోగదారులపై కొంత భారం వేయక తప్పట్లేదని మారుతీ సుజుకి పేర్కొంది. ధరల పెంపు తర్వాత స్విఫ్ట్ మోడల్ ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.99 లక్షల మధ్య అందుబాటులో ఉండనుంది. గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్ ధర రూ. 10.8 లక్షల వద్ద ప్రారంభమవుతుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed