- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
షేక్ చేస్తున్న మారుతీ సుజుకి బుకింగ్స్.. డెలివరీలకు సిద్ధంగా జిమ్మీ కార్లు
దిశ,వెబ్‌డెస్క్: జిమ్మీ కార్లు వేల సంఖ్యలో బుకింగ్స్ అయినప్పటికీ కార్ డెలివరీలు ఇంత వరకూ చేయలేదు. కస్టమర్లు ఎప్పుడెప్పుడు డెలివరీ ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ కంపెనీకి 30 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయి. అయితే ఈ కార్ ధర నిర్ణయించక ముందే బుకింగ్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఎస్‌యూవీ జూన్ 7న అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
డెలివరీలు ఎప్పుడంటే:
5 డోర్ మారుతీ జిమ్మీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే మూడు రకాల కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పటికే 1000 యూనిట్లు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే మొదటి విడత డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లో అత్యధిక ప్రజాధరణ పొందిన 3 డోర్ జిమ్మీ ఇప్పుడు భారత్‌లో 5 డోర్ జిమ్మీకార్ రూపంలో విడుదలకానుంది. కంపెనీ ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్ వంటి విషయాలు ఇప్పటికే వెల్లడించింది. ఇక ధరలు మాత్రమే వెల్లడించలేదు. అయితే ఇంకా ధరలు నిర్ణయించకముందే ఇప్పటికే 30వేలకు పైచిలుకు కార్లు బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే 50 వేల కార్ల బుకింగ్స్ కానున్న నేపథ్యంలో ఇక జాప్యం లేకుండా త్వరగా డెలివరీలు అందించాలని కంపెనీ భావిస్తోంది.
మైలేజ్ ఇలా:
మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన జిమ్మీ 5 డోర్ వెర్షన్ 16.94 కెఎంపీఎల్ ఇస్తుంది. అదే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్ 16.39 కెఎంపీఎల్ వరకూ అందిస్తుంది. దీని ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్లుగా కంపెనీ పేర్కొంది. జిమ్మీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల ఎక్స్ షోరూమ్ ధరలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీశీయ మార్కెట్లో ఇది మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా కార్లకు కాంపిటేటర్‌గా నిలవనుంది. కంపెనీ ఈ 5 డోర్ జిమ్మీ కోసం జనవరి నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇందులో 105 హార్స్ పవర్, 134.2 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 1.5 లీటర్ కె15బి ఇంజిన్ ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగి ఉంది.