మారుతీ సుజుకి బంపర్ ఆఫర్: రూ.2.30 లక్షల వరకు తగ్గింపు

by Disha Web Desk 17 |
మారుతీ సుజుకి బంపర్ ఆఫర్: రూ.2.30 లక్షల వరకు తగ్గింపు
X

చెన్నై: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఎంపిక చేసిన మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ నెల నుంచి జిమ్నీ, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా కార్లపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, ఇతర ప్రయోజనాలను అందించనుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, మారుతీ సుజుకి ఇటీవల విడుదల చేసిన జిమ్నీ మోడల్ థండర్ ఎడిషన్‌ను రూ. 10.74 లక్షల ప్రారంభ ధరతో(ఎక్స్-షోరూమ్) విక్రయిస్తోంది. వినియోగదారులు ఈ మోడల్‌పై రూ. 2.30 లక్షల వరకు తగ్గింపు ఆఫర్ పొందనున్నారు.

అలాగే, ఆల్ఫా, జెట్ వేరియంట్లపై కూడా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక, కంపెనీకి చెందిన బలెనో మోడల్ ఆధారంగా తీసుకొచ్చిన ఫ్రాంక్స్ మోడల్ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఈ కారు కొనే కస్టమర్లకు రూ. 40,000 వరకు ప్రయోజనాలు అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక, గ్రాండ్ విటారా మోడల్‌పై రూ. 35,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇటీవల మారుతీ సుజుకి జనవరి 1 నుంచి అన్ని కార్ల ధరలను పెంచుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.Next Story

Most Viewed