రూ. 4.8 లక్షలకే మారుతీ సుజుకి కొత్త కారు.. 35 కి.మీ. మైలేజ్

by Disha Web Desk 17 |
రూ. 4.8 లక్షలకే మారుతీ సుజుకి కొత్త కారు.. 35 కి.మీ. మైలేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘Tour H1(టూర్ హెచ్1)’. ఇది సేమ్ ఆల్టో వేరియంట్‌ మాదిరిగా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 4.8 లక్షలు. టూర్ H1 796cc F8D పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. కారు బరువు తక్కువగా ఉంటుందని దీంతో మెరుగైన మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. లీటర్ పెట్రోల్‌కు 24.60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. S-CNG వేరియంట్ కూడా లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 5.7 లక్షలు. మైలేజ్ కిలోగ్రాముకు 34.46 కి.మీ. ఇది రద్దీగా ఉండే నగర రోడ్లు, ఇరుకైన లేన్లకు ఖచ్చితంగా సరిపోతుంది. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని తయారు చేశారు.

కారు స్టైలిష్‌గా, విశాలంగా కనిపించేలా ఇంటీరియర్ డిజైన్ చేయబడింది. ఎయిర్‌బ్యాగ్‌, మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. EBD, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హెడ్‌లైట్ లెవలింగ్‌తో కూడిన ABS. కారులోనే విశ్రాంతి తీసుకోవడానికి సరిపడనంత స్థలం, డిజిటల్ స్పీడోమీటర్, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, రిమోట్ బ్యాక్ డోర్ ఓపెనర్, రిమోట్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, హీటర్‌తో కూడిన ఎయిర్ కండీషనర్, పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

Maruti Suzuki Alto K10 Tour H1 launched at Rs 4.80 lakh: Up to 34.46 km/kg mileage

Next Story

Most Viewed