- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
కరోనా ముందు స్థాయిని దాటిన ఎంఅండ్ఏ, కార్పొరేట్ ఒప్పందాలు!

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్‌లో విలీనం, కొనుగోళ్లు, ఇతర కార్పొరేట్ ఒప్పందాలు 2022లో కరోనా ముందు స్థాయిలను అధిగమించాయి. గతేడాది మొత్తం 2,103 లావాదేవీలు జరగ్గా.. వాటి విలువ సుమారు రూ. 12.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. విలువ పరనంగా 2021లో జరిగిన మొత్తం కంటే 28 శాతం పెరిగినట్టు పీడబ్ల్యూసీ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. కీలక సవాళ్ల మధ్య కూడా దేశీయంగా పటిష్టమైన కార్పొరేట్ ఒప్పందాలు జరగడం విశేషమని నివేదిక అభిప్రాయపడింది.
మొత్తం లావాదేవీల్లో విలీనం, స్వాధీనం(ఎంఅండ్ఏ) చేసుకున్నవాటి వాటాయే అత్యధికంగా ఉందని, ఇవి రికార్డు స్థాయిలో రూ. 8.72 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది 2021 కంటే దాదాపు రెండు రెట్లని నివేదిక పేర్కొంది. అందులో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల విలీనాన్ని మినహాస్తే ఎంఅండ్ఏ వృద్ధి 2021 కంటే 15 శాతం తక్కువగా ఉందని నివేదిక అభిప్రాయపడింది. ఇక, గతేడాది ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ. 4.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇవి కూడా 2021 కంటే 22 శాతం తక్కువగా నమోదయ్యాయి.