దేశీయ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన లావా!

by Disha Web |
దేశీయ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన లావా!
X

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ తమ మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ 'లావా బ్లేజ్ 5జీ'ని సోమవారం ఆవిష్కరించింది. దీని ధరలు సుమారు రూ. 10 వేల ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళి నుంచి ప్రీ-బుకింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. స్థానికంగా తయారైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నాం. బడ్జెట్ ధరలోనే కొత్త 5జీ టెక్నాలజీతో కూడా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని లావా ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ సునీల్ రైనా అన్నారు.

దేశీయ తయారీ ద్వారా భారత వృద్ధిని కాంక్షించే ప్రతి భారతీయ పౌరుడికి లావా బ్లేజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అంకితం చేస్తున్నాం. దీని ద్వారా అందరికీ 5జీ టెక్నాలజీ అందించాలనుకుంటున్నామని సునీల్ రైనా అన్నారు. సరికొత్త 5జీ లావా బ్లేజ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్ల పరంగా 50 మెగా పిక్సల్ ఏఐ ట్రిపుల్ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో వస్తుందని కంపెనీ వివరించింది.


Next Story