భారీ పెట్టుబడులతో మార్కెట్ వాటాపై కన్నేసిన లావా!

by Disha Web Desk 13 |
భారీ పెట్టుబడులతో మార్కెట్ వాటాపై కన్నేసిన లావా!
X

న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ మార్కెట్ వాటా కోసం భారీ పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే రెండేళ్లలో కొత్త ఉత్పత్తులు, మార్కెటింగ్ కోసం రూ. 600 కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రూ. 30,000లోపు స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో 10 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ అధ్యక్షుడు సునీల్ రైనా అన్నారు. 2016-17 సమయంలో భారతీయ మొబైల్ కంపెనీలు జీఎస్టీ అమలు, నోట్ల రద్దు వంటి పరిణామాలతోప్ ఆటు విదేశీ కంపెనీలతో ధరల పోటీ కారణంగా దెబ్బతిన్నాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రధానంగా పునరుద్ధరణపై పని చేయాలని భావిస్తోంది. భవిష్యత్తులో పెట్టబోయే పెట్టుబడితో బ్రాండింగ్‌తో పాటు ఎక్కువ భాగం ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌పై ఖర్చు చేయనున్నట్టు సునీల్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీకి 800కి పైగా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. భవిష్యత్తులో వినియోగదారుల సౌలభ్యం కోసం కంపెనీ రిపేర్ ఇంజనీర్లను కస్టమర్ల ఇంటికే పంపించడం ద్వారా 'సర్వీస్ ఎట్ హోమ్' సేవలందించాలని చూస్తున్నట్టు సునీల్ పేర్కొన్నారు.

Next Story