ఎఫ్‌డీల వడ్డీ రేట్లు సవరించిన Kotak Mahindra Bank

by Disha Web Desk 17 |
ఎఫ్‌డీల వడ్డీ రేట్లు సవరించిన Kotak Mahindra Bank
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు తమ రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఈ క్రమంలోనే కోటక్ మహీంద్రా బ్యాంక్ శుక్రవారం(ఫిబ్రవరి 10) నుంచి అమలయ్యే విధంగా రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తించే వడ్డీలను సవరించింది.

బ్యాంకు అధికారిక వివరాల ప్రకారం, ఒక ఏడాది 25 రోజుల నుంచి 2 ఏళ్ల లోపు డిపాజిట్లకు అధికంగా 7.10 శాతం వడ్డీ పొందవచ్చు. ఇదే కాలవ్యవధికి సీనియర్ సిటిజన్లు 7.60 శాతం వడ్డీ పొందడానికి వీలవుతుంది. మిగిలిన కాలవ్యవధులకు సంబంధించి 180 నుచి 363 రోజుల ఎఫ్‌డీలపై 6 శాతం, 364 రోజుల డిపాజిట్లపై 6.25 శాతం, 365-389 రోజులకు 6.90 శాతం, వడ్డీ లభిస్తుంది.

అన్ని కాలవ్యవధులపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ అందుతుంది. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎస్ఆర్ డిపాజిట్లకు వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది.



Next Story

Most Viewed