కొత్త సెల్టొస్-2023 ఎడిషన్‌ను విడుదల చేసిన కియా ఇండియా!

by Javid Pasha |
కొత్త సెల్టొస్-2023 ఎడిషన్‌ను విడుదల చేసిన కియా ఇండియా!
X

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సమంస్థ కియో ఇండియా తన సెల్టోస్ మోడల్ 2023 ఎడిషన్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 10.89 లక్షలుగా నిర్ణయించామని, అందులో టాప్ మోడల్ ధర రూ. 19.65 లక్షలు ఉంటుందని కంపెనీ తెలిపింది. కొత్తగా తీసుకొచ్చిన వేరియంట్ గత ఎడిషన్ కంటే రూ. 50 వేలు ఎక్కువ ధర ఉండటం గమనార్హం. కియా బేస్ పెట్రోల్ వేరియంట్ ధరలను రూ. 20 వేలు, అన్ని ఇతర పెట్రోల్ వేరియంట్ల ధరలను రూ. 25 వేలు పెంచింది. అన్ని డీజిల్ వేరియంట్ల ధరలను రూ. 50 వేల వరకు అధిక ధరకు కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొత్త ఏడిషన్‌లో కియా కీలక మార్పు చేసింది. ముఖ్యంగా బీఎస్6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలతో పాటు ఆర్‌డీఈ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా కారు ఇంజన్‌లో మార్పు చేసింది. కొత్త ఉద్గార నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. అలాగే, 1.4 పెట్రోల్ ఇంజిన్‌తో ఐడిల్ స్టార్ట్-స్టాప్ ఫీచర్‌తో తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ద్వారా ఇంధన సామర్థ్యం పెరుగుతుందని, పెట్రోల్ వెర్షన్ 6-స్పీడ్ మాన్యువల్, డీజిల్ 6-స్పీడ్ ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed