కరూర్ వైశ్యా బ్యాంక్ కీలక నిర్ణయం.. లోన్స్‌పై వడ్డీ భారం పెంపు

by Disha Web Desk 17 |
కరూర్ వైశ్యా బ్యాంక్ కీలక నిర్ణయం.. లోన్స్‌పై వడ్డీ భారం పెంపు
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్) ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన రుణ రేట్లు మంగళవారం(డిసెంబర్ 6) నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. వినియోగదారులు తీసుకునే రుణాలపై నేరుగా ప్రభావం చూపే కీలకమైన ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌ 8.80 శాతం నుంచి 9.05 శాతానికి పెరిగింది.

ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్‌ పెంపు వల్ల బ్యాంకులు ఇచ్చే గృహ, ఆటో, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లపై నేరుగా ప్రభావితం ఉంటుంది. ఈ నేపథ్యంలో కరూర్ వైశ్యా బ్యాంక్ ఎంసీఎల్ఆర్‌ను పెంచడం వల్ల ద్వారా రుణాలపై వడ్డీ రేట్ల భారం పెరగనుంది.

బ్యాంకు వివరాల ప్రకారం, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.30 శాతానికి, నెల రోజుల ఎంసీఎల్ఆర్ 8.45 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.60 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి పెరిగింది. ఆర్‌బీఐ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అధిక రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు గత మూడు సమావేశాల్లో 50 బేసిస్ పాయింట్ల చొప్పున కీలక రేటును పెంచి 5.90 శాతానికి చేర్చింది. ప్రస్తుతం ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం జరుగుతుండగా, బుధవారం సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటిస్తారు.


Next Story