టైమ్ 100 జాబితాలో ఆకాశ్ అంబానీ!

by Disha Web Desk 17 |
టైమ్ 100 జాబితాలో ఆకాశ్ అంబానీ!
X

న్యూఢిల్లీ: అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు టెలికాం దిగ్గజ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ 2022 గానూ టైమ్‌ మ్యాగజైన్‌ వార్షిక 'నెక్స్ట్-100 వరల్డ్ రైజింగ్ స్టార్స్' జాబితాలో చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడు ఆకాశ్ అంబానీ కావడం విశేషం. అలాగే, ఇందులో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త ఆమ్రపాలి గ్యాన్ కూడా ఉన్నారు.

అత్యంత సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వారసుడైనప్పటికీ ఆకాష్ అంబానీ వ్యాపారంలో మెరుగ్గా రాణిస్తున్నాడు. అందుకోసం అతను కష్టపడుతున్నాడని టైమ్ మ్యాగజైన్ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూన్ 30న ఆకాశ్ అంబానీ దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఛైర్మన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే.

జియో ప్రస్తుతం 42.6 కోట్ల సబ్‌స్క్రైబర్లతో టెలికాం రంగంలో అత్యధిక వినియోగదారులను కలిగి ఉంది. ఆకాశ్ అంబానీ గూగుల్, ఫేస్‌బుక్ కంపెనీల నుంచి పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని టైమ్ మ్యాగజైన్ తెలిపింది. కాగా, భవిష్యత్తుని ప్రభావితం చేస్తూ ఎదుగుతున్న 100 మంది ప్రపంచ స్థాయి అత్యంత ప్రతిభావంతమైన వారి పేర్లను మ్యాగజైన్ సంస్థ టైమ్‌ 100 జాబితాను ప్రతి ఏటా ప్రకటిస్తుంది.

ఇక, ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారత సంతతికి వ్యక్తి ఆమ్రపాలి గ్యాన్ ఓన్లీ ఫ్యాన్స్ అనే కంటెంట్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌కు సీఈఓగా ఉన్నారు.


Next Story

Most Viewed