జూన్‌లో కొత్తగా 42 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సాధించిన జియో!

by Disha Web Desk 16 |
జూన్‌లో కొత్తగా 42 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సాధించిన జియో!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నెలలో దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్తగా 42 లక్షల సబ్‌స్క్రైబర్లను పొంది టెలికాం పరిశ్రమలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం, మరో దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా 7.93 లక్షల మంది వినియోగదారులను చేర్చుకోగా, ఎప్పటిలాగే వొడాఫోన్ ఐడియా 18,01,186 మందిని కోల్పోయింది. ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్ 13,27,999 మందిని, ఎంటీఎన్ఎల్ 3038 మంది సబ్‌స్క్రైబర్లను పోగొట్టుకున్నాయి.

మొత్తంగా 2022, జూన్ చివరినాటికి భారత్‌లో మొత్తం టెలికాం వినియోగదారులు 18.88 లక్షల మందిని పెరిగారని ట్రాయ్ పేర్కొంది. దీంతో మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య మే చివరి నాటికి 117.07 కోట్ల నుంచి జూన్ సమయానికి 117.29 కోట్లకు పెరిగారు. పట్టణ ప్రాంతాల్లో 64.78 కోట్ల నుంచి 64.90 కోట్లకు పెరిగారు. గ్రామీణ ప్రాంతాల్లో 52.38 కోట్లకు వినియోగదారులు వృద్ధి చెందారు. అలాగే, సమీక్షించిన సమయానికి టెలికాం రంగంలో ప్రైవేట్ కంపెనీల వాటా 90 శాతం ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వాటా 10 శాతం మాత్రమే ఉంది.


Next Story