- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
JioPay: జియో మరో సంచలన నిర్ణయం.. త్వరలో "జియో పే"..?
దిశ, వెబ్ డెస్క్: దేశ టెలికాం సంస్థలో చరిత్ర సృష్టించిన రిలయన్స్(Reliance)(జియో) భారత నెట్ వర్క్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చింది. జియో సేవలు అందుబాటులోకి వచ్చిన అనతి కాలంలోనే తక్కువ ధరలకు ఎక్కవు స్పీడ్‌లో నెట్‌వర్క్ ను అందించడంతో కోట్లాది భారతీయుల మన్ననలు పొందింది. అలాంటి జియో నెట్ వర్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భారత ప్రజలకు ఆన్ సేవలను సులభతరం చేసిన యూపీఐ సేవలను జియో(JIO) అందించేందుకు సిద్ధం అయిందని వార్తలు వస్తున్నాయి. ఆన్ లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్ గా పనిచేయడానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(Jio Financial Services)లో భాగంగా.. జియో పేమెంట్ సొల్యూషన్స్ (Jio Payment Solutions)కు ఆర్బీఐ(RBI) అనుమతి ఇచ్చింది. దీంతో అన్ని రంగాల్లో ఇకపై జియో(JIO) తో డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. దీంతో యూపీఐ(UPI) ఆన్ లైన్ పేమెంట్లు అయిన గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే తరహాలోనే త్వరలో జియో పేమెంట్స్ యాప్ అందుబాటులోకి రానుంది. జియో రాకతో తీవ్రమైన పోటీ ఎదుర్కొన్న టెలికాం సంస్థల మాదిరిగానే జియో పేమెంట్స్ రాకతో..గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే లు కూడా త్వరలో గట్టిపోటీని ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.