జియో కొత్త ప్లాన్.. రూ. 1197 లకే 3 నెలలు ఇంటర్నెట్

by Disha Web Desk 17 |
జియో కొత్త ప్లాన్.. రూ. 1197 లకే 3 నెలలు ఇంటర్నెట్
X

దిశ, వెబ్‌డెస్క్:రిలయన్స్ జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం కొత్తగా ఒక ప్లాన్‌ను తీసుకొచ్చింది.ఎక్కువ ఇంటర్నెట్ కావాలనుకునే వారికోసం ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 1197. మూడు నెలల పాటు ఇది వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. నెట్ స్పీడ్ 30 Mbps వస్తుంది. వాయిస్ కాలింగ్‌తో 90-రోజుల చెల్లుబాటుతో ప్రతినెలా అపరిమిత డేటా .. అంటే ప్రతి నెలా 3.3TB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు అదనంగా జీఎస్టీ యాడ్ అవుతుంది. ముఖ్యంగా ఈ ప్లాన్‌లో OTT బెనిఫిట్స్ ఏం లభించవు. OTT ప్రయోజనాల కోసం అయితే ఇతర ప్లాన్‌లను తీసుకోవడం ఉత్తమం. వర్క్ ఫ్రం హోమ్ నడుస్తున్న తరుణంలో ఉద్యోగులకు రూ. 1197 ప్లాన్ బాగా ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed