మీకు కోటి రూపాయల రాబడి కావాలా..? అయితే PF ఖాతాలో ఇలా చేయండి!

by Disha Web Desk 17 |
మీకు కోటి రూపాయల రాబడి కావాలా..? అయితే PF ఖాతాలో ఇలా చేయండి!
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్టుబడుల ద్వారా భారీ మొత్తం సంపాదించుకోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే అందుకు సరైన ప్రణాళిక తప్పకుండా ఉండాలి. ఏ పథకాల్లో డబ్బులు పెట్టడం ద్వారా ఎక్కువ రాబడి వస్తుందో అని అన్ని లెక్కలు వేసుకున్నాక, వాటిలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. దేశవ్యాప్తంగా అందరికీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) గురించి తెలిసే ఉంటుంది. పెట్టుబడులకు మంచి రాబడి ఇచ్చే పథకాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. క్రమం తప్పకుండా నిర్దిష్ట మొత్తంలో డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా 60 ఏళ్లు/ పదవీ విరమణ తర్వాత జీవితానికి ఆర్థిక సాంత్వన అందించడానికి ఈ పథకం సరిగ్గా ఉపయోగపడుతుంది. పెద్ద మొత్తంలో కోటి రూపాయలకు పైగా రాబడి కావాలనుకునే వారికి కూడా ఈ ఫండ్ చాలా మంచి ఆప్షన్.


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ను బ్యాంకు లేదా ఏదైనా పోస్టాఫీసులో ప్రారంభించవచ్చు. ప్రతి సంవత్సరం ఖాతాలో కనీసం రూ.500 ఉండాలి. PPF ఖాతాకు మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. దీనిని మరో మూడు సార్లు 5 సంవత్సరాల ప్రాతిపదికన 15 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు. గరిష్టంగా 12 ఇన్‌స్టాల్‌మెంట్లలో డిపాజిట్ చేయగల గరిష్ట మొత్తం 1.5 లక్షలు. PF ఖాతాపై వడ్డీ రేటు 7.1% గా ఉంది. 80C సెక్షన్ కింద ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది.


కోటి రూపాయలు పొందడానికి కస్టమర్లు 35 సంవత్సరాల పాటు నెలకు రూ. 4,585 చొప్పున పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మెచ్యూరిటీ తర్వాత ఒక కోటి రూపాయలు పొందవచ్చు. అదే 30 సంవత్సరాల పాటు ఏడాదికి రూ. 1.5 లక్షల(నెలకు రూ. 12,500) పెట్టుబడి పై రూ.1.54 కోట్ల రాబడి పొందొచ్చు. 25 సంవత్సరాల పాటు అయితే ప్రతి నెలా రూ.10,720 పెట్టుబడి ద్వారా ఒక కోటి రూపాయలు సంపాదించవచ్చు.





Next Story