ఆన్‌లైన్లో ఫెరారీ అంతర్గత డాక్యుమెంట్స్.. సైబర్ ఎటాక్స్ జరిగిన దాఖలాలు..

by Disha Web Desk 14 |
ఆన్‌లైన్లో ఫెరారీ అంతర్గత డాక్యుమెంట్స్.. సైబర్ ఎటాక్స్ జరిగిన దాఖలాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫెరారీకి తాజాగా పెద్ద షాక్ తగిలింది. సంస్థకు సంబంధించిన అంతర్గత డాక్యుమెంట్లు సోమవారం ఆన్‌లైన్‌లో పోస్ట్ అయ్యాయి. దీంతో సంస్థ యాజమాన్యానికి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. అయితే తాజాగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు పెరుగుతుండగా ఫెరారీ సర్వర్స్ కూడా హ్యాక్‌కు గురయ్యాయని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ సంస్థ సిస్టమ్స్ ఎటువంటి సైబర్ ఎటాక్‌కు గురయినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సంస్థ పేర్కొంది.

ప్రస్తుతం ఫెరారీ తన అంతర్గత డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌ ఎలా పోస్ట్ అయ్యాయి. ఎవరు చేశారు అన్న విషయాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సమస్యలపై చర్యలు చేపట్టామని యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా సీస్టమ్స్‌పై సైబర్ ఎటాక్ జరిగినట్లుగాని, రాన్సమ్‌వేర్ ఏమీ లేవని, వాటితో పాటుగా తమ బిజినెట్, కార్యకలాపాలు విషయంలో కూడా ఎటువంటి అంతరాయం జరగలేదని సంస్థ చెప్పుకొచ్చింది. ఇందుకు అసలు కారణాన్ని తెలుసుకునేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని సంస్థ పేర్కొంది.


Next Story