ఐదారేళ్లలో రూ. 8.2 లక్షల కోట్లకు టెక్స్‌టైల్ రంగం!

by Disha Web Desk 17 |
ఐదారేళ్లలో రూ. 8.2 లక్షల కోట్లకు టెక్స్‌టైల్ రంగం!
X

న్యూఢిల్లీ: భారత టెక్స్‌టైల్స్ రంగం మరో 5-6 ఏళ్లలో రూ. 8.25 లక్షల కోట్ల విలువైన ఎగుమతులను సాధించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీనివల్ల దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ కలిపి పరిశ్రమ విలువ రూ. 20.64 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఎగుమతి ప్రోత్సాహక మండలి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన, 2021-22లో దేశీయ టెక్స్‌టైల్ విభాగం నుంచి రూ. 3.46 లక్షల కోట్ల విలువైన సరఫరా జరిగిందన్నారు. తయారీదారులు డిమాండ్‌ను తీర్చేందుకు తగిన వనరులను సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు.

దాంతో రాబోయే ఐదారేళ్లలో వస్త్ర ఎగుమతులు రూ. 8.25 లక్షల కోట్లు(100 బిలియన్ డాలర్ల)కు చేరుకోవాలని లక్ష్యాన్ని కలిగి ఉండాలన్నారు. టెక్స్‌టైల్ మిషన్ కింద పరిశ్రమకు కావాల్సిన నిధులు అందుబాటులో ఉనాయని, కొత్త ప్రాజెక్టుల కోసం వాటిని వినియోగించాలని, తద్వారా జీ-20లో టెక్స్‌టైల్ రంగం సామర్థ్యాన్ని ప్రదర్శించవచ్చని పీయూష్ గోయల్ తెలిపారు.



Next Story

Most Viewed