మూడేళ్లలో రూ. 15 లక్షల కోట్లకు ఈ-కామర్స్ మార్కెట్ విలువ!

by Disha Web Desk 17 |
మూడేళ్లలో రూ. 15 లక్షల కోట్లకు ఈ-కామర్స్ మార్కెట్ విలువ!
X

న్యూఢిల్లీ: భారతీయ ఈ-కామర్స్ మార్కెట్ విలువ రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 15.20 లక్షల కోట్లకు పెరుగుతుందని ఓ నివేదిక అంచనా వేసింది. గతేడాది నాటికి ఇది రూ. 6.82 లక్షల కోట్లు ఉండగా, యూపీఐ లావాదేవీల ద్వారా ఈ వృద్ధి సాధ్యమవుతుందని గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ ఎఫ్ఐఎస్ తన నివేదికలో వెల్లడించింది. రియల్‌టైమ్ పేమెంట్స్‌కు సంబంధించి మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడం ద్వారా భారత్ యూపీఐ చెల్లింపుల విభాగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని ఎఫ్ఐఎస్ అభిప్రాయపడింది.

దేశంలో నగదు వినియోగం క్రమంగా తగ్గుతోంది. 2019లో పాయింట్ ఆఫ్ సేల్ వాటా మొత్తం లావాదేవీల్లో 71 శాతం ఉండగా, 2022 నాటికి ఇది 27 శాతానికి దిగొచ్చింది. 2023, జనవరిలో యూపీఐ లావాదేవీల సంఖ్య 74 శాతం వృద్ధి చెందింది. దీనికి ఈ-కామర్స్ చెల్లింపుల్లో 53 శాతం పెరుగుదల ఎంతో దోహదపడిందని, 2026 నాటికి 195 శాతం వృద్ధిని సాధించగలదని నివేదిక తెలిపింది.

2020, మార్చి నుంచి 2022, ఆగస్టు మధ్య యూపీఐ లావాదేవీల సంఖ్య 427 శాతంతో భారీ వృద్ధిని సాధించింది. డిజిటల్ వ్యాలెట్ల లావాదేవీలు 2026 నాటికి విలువ పరంగా 88 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది.

Also Read...

భారీగా ఉద్యోగులను తొలగించనున్న గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్!



Next Story

Most Viewed