గతేడాది 3 శాతం తగ్గిన బంగారం వినియోగం!

by Disha Web Desk 7 |
గతేడాది 3 శాతం తగ్గిన బంగారం వినియోగం!
X

ముంబై: గతేడాది భారత్‌లో బంగారం వినియోగం 3 శాతం తగ్గిందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. సెప్టెంబర్-డిసెంబర్ త్రైమాసికంలో పసిడి ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా ప్రజలు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. దీంతో వినియోగం పడిపోయిందని డబ్ల్యూజీసీ మంగళవారం ప్రకటనలో తెలిపింది. అయితే, దీనివల్ల భారత వాణిజ్య లోటు తగ్గేందుకు, బలహీనంగా ఉన్న రూపాయి విలువ మరింత క్షీణించకుండా సహాయపడిందని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. గణాంకాల ప్రకార్మ, గతేడాది మొత్తం బంగారం వినియోగం 774 టన్నులకు పరిమితమైంది.

డిసెంబర్ త్రైమాసికంలో మాత్రమే 20 శాతం క్షీణించి 276.1 టన్నుల వినియోగం నమోదైంది. ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా చాలామనిద్ తమ వద్ద ఉన్న పాత బంగాన్ని విక్రయించారని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల సీజన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పంటలు చేతికి అందే సమయం కావడంతో ఈ ఏడాది మార్చి నాటికి పసిడి డిమాండ్ పెరుగుతుందని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. కాగా, మంగళవారం నాటికి పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 170 తగ్గి రూ. 57,270గా ఉంది. 22 క్యారెట్లు రూ. 150 తగ్గి రూ. 52,500 వద్ద ఉంది. వెండి కిలోకు రూ. 200 తగ్గి రూ. 74,500 వద్ద ఉంది.


Next Story

Most Viewed