సెబీ వద్ద నుంచి ఐపీఓ పత్రాలను వెనక్కి తీసుకున్న జోయలుక్కాస్!

by Disha Web Desk 17 |
సెబీ వద్ద నుంచి ఐపీఓ పత్రాలను వెనక్కి తీసుకున్న జోయలుక్కాస్!
X

ముంబై: దేశీయ ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ జోయలుక్కాస్ ఐపీఓ నుంచి వెనకడుగు వేసింది. రూ. 2,300 కోట్ల విలువైన నిధులను సేకరించేందుకు దరఖాస్తు చేసిన ఐపీఓ పత్రాలను సెబీ వద్ద నుంచి ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన కారణాలను కంపెనీ వెల్లడించలేదు. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,400 కోట్ల విలువైన మొత్తాన్ని రుణాలను తగ్గించుకునేందుకు వినియోగిస్తామని జోయలుక్కాస్ గతంలో ప్రకటించింది.

కానీ ఇప్పుడు ఐపీఓ నుంచి దూరం జరగడంతో రుణ భారం నుంచి ఎలా బయటపడుతుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే జోయలుక్కాస్ సంస్థ దేశవ్యాప్తంగా 68 నగరాల్లో స్టోర్లను కలిగి ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఆభరణాల రిటైల్ సంస్థగా ఉంది.



Next Story

Most Viewed