ప్రపంచంలోనే అత్యంత చౌకైన పాస్‌పోర్ట్‌లలో రెండవ స్థానంలో భారత పాస్‌పోర్ట్

by Disha Web Desk 17 |
ప్రపంచంలోనే అత్యంత చౌకైన పాస్‌పోర్ట్‌లలో రెండవ స్థానంలో భారత పాస్‌పోర్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత చౌకైన పాస్‌పోర్ట్‌లలో భారత పాస్‌పోర్ట్ రెండవ స్థానంలో ఉందని ఒక నివేదిక పేర్కొంది. అలాగే, ఒక సంవత్సరం వ్యాలిడిటీ ప్రాతిపదిక అయ్యే ఖర్చును పరిగణలోకి తీసుకుంటే కూడా భారత్ పాస్‌పోర్ట్ తక్కువ ధర కలిగి ఉందని ఒక అధ్యయనంలో తేలింది. UAE పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. భారత దేశ పాస్‌పోర్ట్ 10 సంవత్సరాల చెల్లుబాటుకు 18.07 డాలర్లు ఖర్చు అవుతుండగా, ఏడాదికి1.81 డాలర్ల ఖర్చు అవుతుందని ఆస్ట్రేలియాకు చెందిన ఒక సంస్థ పేర్కొంది. ఇది వివిధ దేశాల పాస్‌పోర్ట్‌ల కొనుగోలు ఫీజులు, చెల్లుబాటు, ఖర్చు-ప్రభావం, వీసా లేకుండా ప్రయాణం అందించే దేశాల సంఖ్య పరంగా వాటి విలువను అధ్యయనం చేసింది.

జాబితాలో మెక్సికో అత్యంత ఖరీదైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఉంది. మెక్సికన్ పాస్‌పోర్ట్‌కు 10 సంవత్సరాలకు 231.05 డాలర్లు, ఆస్ట్రేలియా పాస్‌పోర్ట్‌కు 225.78 డాలర్లు ఖర్చవుతుంది. భారతీయ పాస్‌పోర్ట్‌తో, ప్రజలు వీసా లేకుండా 62 దేశాలకు ప్రయాణించగలరు. అయితే ఇది ఆస్ట్రేలియా, USA, కెనడా వంటి దేశాలతో పోలిస్తే తక్కువ దేశాలకు యాక్సెస్ అందిస్తుంది.

Next Story

Most Viewed