వాహన పరిశ్రమలో అమ్మకాల జోరు!

by Disha Web Desk 17 |
వాహన పరిశ్రమలో అమ్మకాల జోరు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది నవంబర్‌లో దేశీయ వాహన పరిశ్రమ మెరుగైన అమ్మకాలను సాధించింది. దేశీయంగా పండుగ సీజన్ మద్దతు కారణంగా వినియోగదారుల డిమాండ్ మెరుగ్గా ఉండటంతో ప్యాసింజర్ వాహనాలతో పాటు భారీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి గత నెలలో మొత్తం 1.59 లక్షల యూనిట్లను విక్రయించగా, ఇది గత ఏడాది 14.3 శాతం పెరిగాయి. మరో దిగ్గజ హ్యూండాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు 36 శాతం 64,004 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా అమ్మకాల్లో కంపెనీ ఎగుమతులు, దిగుమతుల్లో రెండింటిలోనూ 30 శాతం చొప్పున వృద్ధి సాధించింది.

టాటా మోటార్స్ గతేడాది కంటే 21 శాతం ఎక్కువగా 75,478 యూనిట్లను, మహీంద్రా అండ్ మహీంద్రా 56 శాతం ఎక్కువ అమ్మకాలను చూశాయి. యుటిలిటీ వాహనాల విభాగంలో అధిక గిరాకీ కనిపించిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గ్రామీణ మార్కెట్లో కూడా గిరాకీ ఉండటంతో ట్రాక్టర్ అమ్మకాలు పెరిగాయి.

అమ్మకాల్లో మహీంద్రా 10.3 శాతం, ఎస్కార్ట్స్ కుబోటా 11.3 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహన విభాగంలో టీవీఎస్‌ మోటార్‌ అమ్మకాలు 1.6 శాతం, రాయల్ ఎన్‌ఫీల్డ్ 37 శాతం పెరగ్గా, బజాజ్‌ ఆటో 19 శాతం క్షీణతను ఎదుర్కొంది. కమర్షియల్ విభాగంలో ఐషర్ మోటార్స్ 20 శాతం, అశోక్ లేలాండ్ 39 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేశాయి.


Next Story

Most Viewed