డిసెంబర్ 29 నుంచి అమల్లోకి భారత్, ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం!

by Disha Web Desk 17 |
డిసెంబర్ 29 నుంచి అమల్లోకి భారత్, ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం!
X

న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం డిసెంబర్ 29 నుంచి అమల్లోకి రానుంది. ఇరు దేశాల మధ్య ఒప్పందంపై సంతకాలు చేసిన దాదాపు తొమ్మిది నెలల అనంతరం ఇది అమల్లోకి వస్తుంది. దీనివల్ల రెండు దేశాల వాణిజ్యం సుమారు రెండు రెట్లు పెరిగి రూ. 3.66 లక్షల కోట్ల నుంచి రూ. 4.06 లక్షల కోట్ల(40-50 బిలియన్ డాలర్ల)కు పెరుగుతుంది. ఈ ఒప్పందం కోసం అవసరమైన ప్రక్రియ మొత్తం పూర్తయినట్టు భారత ప్రభుత్వం తెలియజేసిందని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది.

ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందానికి ఈ మధ్యనే ఆస్ట్రేలియా పార్లమెంటులో ఆమోదం లభించింది. దీంతో వివిధ ఉత్పత్తులు, ముడి పదార్థాలపై పన్నుల భారం భారీగా తగ్గి, ఎగుమతులు, దిగుమతులు వృద్ధి చెందనున్నాయి.

ప్రస్తుతానికి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే వాణిజ్య విలువ రూ. 2 లక్షల కోట్ల(25 బిలియన్ డాలర్ల) కంటే ఎక్కువగా ఉంది. ఆస్ట్రేలియా నుంచి భారత్ దిగుమతి చేసుకునే దాంట్లో దాదాపుగా 70 శాతం వాటా బొగ్గు కలిగి ఉంది. దేశీయ ఉక్కు రంగం ఎక్కువగా వినియోగించే బొగ్గుపై ప్రస్తుతం 2.5 శాతం పన్ను ఉండగా, తాజా వాణిజ్య ఒప్పందం అమలైతే పన్నులుండవు.

అంతేకాకుండా అనేక భారత ఉత్పత్తులపై పన్నులు తొలగించబడతాయి. వీటిలో ఆభరణాలు, ఫార్మా, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ సహా అనేక వస్తువులపై పన్నులు లేకపోవడం లేదా తగ్గడం వంటి ప్రయోజనాలున్నాయి.


Next Story

Most Viewed