మార్కెట్‌లో ఉల్లి లొల్లి.. భారీగా పెరిగిన ధరలు!

by Samataha |
మార్కెట్‌లో ఉల్లి లొల్లి.. భారీగా పెరిగిన ధరలు!
X

దిశ, ఫీచర్స్ : సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. నిత్యవసరాల్లో ఒకటి అయిన ఉల్లి ధర భారీగా పెరిగింది. ఇప్పటికే టమాటో ధర పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతుంటే, మరోసారి ఉల్లి ధర కూడా వారి పాలిట భారంగా మారింది. నిన్న మొన్నటి వరకు వందకు మూడు నుంచి ఐదు కిలోల వరకు ఉల్లిని విక్రయించగా ఇప్పుడు ఏకంగా కిలో ధర రూ.45 నుంచి 50 వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ మార్కెట్‌లో కేజీ టమాట ధర రూ. 60 నుంచి 70 ఉండగా, కేజీ ఉల్లి ధర రూ.45 నుంచి 50 ఉండటంతో ఇది సామాన్యుల జేబులకు చిల్లు పడేలా చేస్తుంది. దీంతో ఉల్లి, టమాట కొనుగోలు చేయడానికి సామాన్యులు వణికిపోతున్నారు.

అయితే ఉల్లి ధర పెరగడానికి ముఖ్య కారణం మహారాష్ఠ్ర నుంచి దిగుమతులు తగ్గడమే, కారణం అంటున్నారు వ్యాపారులు. ఎందుకంటే గతంలో 450 టన్నుల ఉల్లి దిగుమతి కాగా, ప్రస్తుతం కేవలం 250 టన్నులు మాత్రమే దిగుమతి అవుతుందంట. మరీ ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఏపీలోని తాడేపల్లి గూడెం మార్కెట్ నుంచి కూడా ఉల్లి దిగుమతి భారీగా తగ్గిందంట. అందుకే రేటు అమాంతం పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మార్కెట్‌లో ఉల్లి లొల్లి మొదలైంది. ధరల పెరుగుదలతో, మరింత పెరిగే ఛాన్స్ ఉందని బయపడి, కొందరు ఎక్కువగా ఉల్లిని కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపుతున్నారు.

Next Story