ఈ ఏడాది 31 శాతం పెరిగిన ఇళ్ల విక్రయాలు

by Disha Web Desk 16 |
ఈ ఏడాది 31 శాతం పెరిగిన ఇళ్ల విక్రయాలు
X
  • హైదరాబాద్‌లో 30 శాతం వృద్ధి
  • 15 శాతం పెరిగిన ధరలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు 31 శాతం పెరిగి దాదాపు 4.77 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని ప్రముఖ స్థిరస్తి కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ, నివాసాల ధరలు సగటున 15 శాతం పెరిగినప్పటికీ ఇళ్ల విక్రయాలు పెరగడం గమనార్హం. గతేడాది దేశవ్యాప్తంగా పధాన ఏడు నగరాల్లో 3,64,870 ఇళ్లు అమ్ముడవగా, ఈసారి 4,76,530కి చేరాయి. డిమాండ్‌కు తగిన స్థాయిలో కొత్త నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయని, ప్రథమార్థంలో అంతర్జాతీయ పరిణామాలు, ఇతర అంశాల ఒత్తిడి ఉన్నా అమ్మకాలు రికార్డు గరిష్టానికి చేరినట్టు ' అనరాక్ ఛైర్మన్ అనూజ్ పురి చెప్పారు. అనరాక్ నివేదిక ప్రకారం, ముంబై మెట్రోలో ఇళ్ల అమ్మకాలు అత్యధికంగా 40 శాతం పెరిగి 1,53,870 యూనిట్లుగా నమోదయ్యాయి. దీని తర్వాత పూణెలో 52 శాతం వృద్ధితో 86,680 యూనిట్లు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 3 శాతం పెరిగి 65,625 యూనిట్లు, బెంగళూరులో 29 శాతం పెరిగి 63,980 యూనిట్లు, హైదరాబాద్‌లో 30 శాతం వృద్ధితో 61,715 యూనిట్లు, కోల్‌కతాలో 9 శాతం అధికంగా 23,030 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో 34 శాతం పెరిగి 21,630 యూనిట్లుగా నమోదయ్యాయి.


Next Story

Most Viewed